1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

శ్రీవిష్ణు ఆర్ట్ క్రియేషన్స్‌ చిత్రంలో నిఖిల్

శ్రీవిష్ణు ఆర్ట్ క్రియేషన్స్‌ నిఖిల్
FileFILE
శ్రీవిష్ణు ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రంలో హ్యాపీడేస్ చిత్రం ఫేమ్ నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌గా పేరొందిన గిరి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా పరశురాం దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

పూరీ జగన్నాథ్, బొమ్మరిల్లు చిత్రం ఫేమ్ భాస్కర్ తదితర దర్శకుల వద్ద పనిచేసిన పరశురాం(బుజ్జీ) తొలిసారి తన స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి.

అలాగఈ చిత్రంలో పాత్రధారులను ఎంపిక చేస్తున్నట్లు, వారి ఎంపిక పూర్తి కాగానే ప్రకటిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
About Writer
Hanumantha Reddy