నాగబాబు ప్రధాన పాత్రలో ఆపదమొక్కుల వాడు
|
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న సందర్భంగా పోసాని మాట్లాడుతూ చిత్రంలోని విశేషాలను వెల్లడించారు. రాజకీయం ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు.
గతంలో తాము తీసిన ఆపరేషన్ ధుర్యోధన చిత్రంలోలో సంఘంలో ప్రజలకుండాల్సిన బాధ్యతను, పోలీసులు, అవినీతి రాజకీయనాయకుల ఆలోచనలను చర్చించామని... ఈ చిత్రంలో రాజకీయనాయకుడు ఎలా ఉండాలి అనే అంశంపై వివరించామన్నారు.
అయితే ఈ చిత్రంలోని పాత్రలు.. కథ ఎవర్నీ ఉద్దేశించినవి కావని...కేవలం అన్నీ కల్పితాలేనని... స్పష్టం చేశారు. నేటి రాజకీయాన్ని ఉద్దేశించి తాము అల్లిన కథలతో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని మలిచామన్నారు.
ఈ చిత్రంలోని హీరో నాగబాబు మాట్లాడుతూ ఆపరేషన్ ధుర్యోధనలో తాను మంచి పాత్రను చేశానని.. ఈ చిత్రంలో దర్శకులు ఏకంగా హీరో పాత్రను కట్టబెట్టారని.. దానికి న్యాయం చేస్తానన్నారు. అలాగే ఈ చిత్రంలో తనతో పాటు అందిరి పాత్రలకు గుర్తింపు ఉంటుందని చెప్పారు.
ఈ చిత్రంలో ఇంకా బాబుమోహన్, అస్మిత, సన, ఉదయభాను, భరణి, చలపతిరావు, ఆపర్ణ తదితరులు నటించగా.. మాటలు కొరటాల శివ అందిస్తున్నారు. సంగీతం లెనినా చౌదరి ఇస్తుండగా.. కెమెరా ఎ రాజా షూట్ చేస్తున్నారు.
