బాలు బాలకృష్ణకి యమ యమ ఫ్యాన్‌లో రాజేంద్ర
|
పెద్ద పెద్ద హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం.. అలాగే వారు తమ అభిమాన నటుడిపై ఎంతటి వాత్సల్యాన్ని కలిగి ఉంటారో ఈ చిత్రంలో తెలుపడమే కాక... ఫ్యాన్స్ అనే వారు సమాజం కోసం కొన్ని మంచి పనులు కూడా చేయాలన్న అంశాన్ని ఈ చిత్రంలో చర్చించామని దర్శకులు చెప్పారు.
గతంలో ఫ్యాన్స్ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అన్న చిత్రం మినహా మరే చిత్రం విజయవంతం కాలేకపోయింది. మరో చిత్రం ఫ్యాన్స్ మాత్రం అనివార్య కారణాలతో విడుదలకు నోచుకోలేదని ఆయన చెప్పారు.
ఈచిత్రంలో బాలకృష్ణ వీరాభిమానిగా రాజేంద్ర అనే ఓ నటుడు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. జనవరిలో రెగ్యులర్‌గా షూటింగ్ జరిపి ఫిబ్రవరి కంతా పూర్తి చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు చెప్పారు.
ఇందులో అభిమానులు ఎలా ఉంటారు.. ఎలా ఉండాలి... తమ అభిమాన నటుడి కోసం జెండాలే కాక.. సమాజం కోసం పాటు పడే విధానాన్ని ఇందులో తెరకెక్కించనున్నట్లు చెప్పాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
