1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

హృతిక్ వైవిధ్య పాత్రలో క్రిష్ ప్రేమలో పడ్డాడు

హృతిక్ వైవిధ్య పాత్ర క్రిష్ ప్రేమలో పడ్డాడు
WD PhotoWD
బాలీవుడ్‌లో సూపర్ హిట్ బంపర్ మూవీగా ఘనవిజయాన్ని సాధించిన ఆప్ ముఝే అచ్చా లగ్‌నాలగే చిత్రంలో హృతిక్ రోషన్, అమీషాపటేల్ హీరోహీరోయిన్‌లుగా నటించారు. ఈ చిత్రంలో వైవిధ్య పాత్రలో నటించిన హృతిక్ అద్భుతమైన నటనను కనబరిచాడు.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ మూవీస్ సంస్థ తెలుగులో అనువదించేందుకు సన్నాహాలు చేస్తోంది. హీరోహీరోయిన్‌ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు... భావోద్వేగాలు కలిగిన సంభాషణలు ప్రేక్షకులను హత్తుకుంటాయి. వీటికి తోడు రాకేష్ రోషన్ సంగీతం చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది.

కహోనా ప్యార్ హై... కోయి మిల్ గయా.. ధూమ్... క్రిష్ వంటి చిత్రాల్లో నటించిన హృతిక్ ఈ చిత్రంలో వైవిధ్య పాత్రలో నటించారని... అలాగే ఆయన ఇమేజ్ తగ్గట్టుగా ఇందులో ఉన్న యాక్షన్ ఎలిమెంట్స్ ఉత్కంఠభరితంగా సాగుతాయని సిల్వర్ స్క్రీన్ సంస్థ వెల్లడించింది.

విక్రమ్‌భట్ దర్శకత్వ సారథ్యాన రూపొందిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఆఖరుకు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. బాలీవుడ్‌లో లాగే టాలీవుడ్‌లోను ఈ చిత్రం అద్భుత విజయం సాధించగలదని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
About Writer
Hanumantha Reddy