డిసెంబర్ 28న ఓ చిన్నారి కోరిక
నాగేంద్రకుమార్ దర్శకత్వ సారథ్యాన రూపొందిన 'ఓ చిన్నారి కోరిక' చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అచ్యుతలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు పంపించనున్నట్లు చెప్పారు.
ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులు వీక్షించారని.. అందరూ ఈ చిత్రాన్ని ప్రశంసించారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని చెప్పారు.
వాస్తవానికి ఆగస్టులో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం వినోదపు పన్ను మినహాయింపు కోసం ఆలస్యమయ్యిందని పేర్కొన్నారు. ఈ చిత్ర విశేషాలను తెలుపుతూ తమ పిల్లల కోసం తగినంత సమయాన్ని కేటాయించక నిర్లక్ష్యానికి గురైన ఓ చిన్నారి కథను తెర కెక్కించామన్నారు.
వీవీవీ లక్ష్మీ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం నేటి తల్లిదండ్రులు.. వారి పిల్లలు వంటి అంశాలు ఇందులో చక్కగా పొందుపరిచామని... ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించే విధంగా సందేశాత్మకంగా మలిచామన్నారు.