1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

బాలాదిత్యతో 1940లో ఒక గ్రామం

బాలాదిత్య 1940 ఒక గ్రామం
FileFILE
బాలాదిత్య హీరోగా.. 1940లో ఒక గ్రామం చిత్రం రూపొందుతోంది. శ్రీలక్ష్మీ నరసింహా సినిమా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నరసింహ నంది దర్శకత్వ సారథ్యాన చిత్రీకరిస్తున్నారు. నందిరెడ్డి నరసింహా రెడ్డి, జువ్విశెట్టి శ్రీరావమ్మ, నందిరెడ్డి నాగమ్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బాలాదిత్య మాట్లాడుతూ నటునిగా నిరూపించే అవకాశం తనకు ఈ చిత్రం ద్వారా లభించడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఇందులో ప్రత్యేకత హీరోయిన్ 'శ్రీ' గుండుతో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.

రెండు వేర్వేరు కులాల మధ్య జరిగే కథే ఈ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. అసలు మనిషి పుట్టుక, వారి మధ్య కులాల విభజన ఎలా జరిగింది అనే అంశాన్ని చర్చించినట్లు పేర్కొన్నాడు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ చిత్రానికి 90 శాతం షూటింగ్ పూర్తయిందన్నారు.

అప్పట్లో అంటే 1940లో నాటి పరిస్థితులకు అనుగుణంగా అప్పటి బాష, వస్త్రాలు, అలంకరణలతో సహా ఎక్కడా తేడా రాకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. మూడు పాటలున్న ఈ చిత్రానికి సంగీతం సాకేత్ సాయిరాం అందిస్తున్నాడు.

ఈ చిత్రంలో ఇంకా ముక్కురాజు, వినోద్, తిలక్, గుండు హనుమంతరావు, జెన్ని, రామకృష్ణ, రాళ్లపల్లి తదితరులు నటిస్తుండగా.. మాటలు నరసిహనంది అందిస్తున్నారు. అలాగే కెమెరా మురలీమోహన్ రెడ్డి షూట్ చేస్తుండగా... బాబు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
About Writer
Hanumantha Reddy