గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » 'అందమైన మనసులో' ఆడియో విడుదల
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
Archanagupta
WD PhotoWD
ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న అందమైన మనసులో చిత్రం ఆర్పీ పట్నాయక్ స్వీయ దర్శకత్వ సారథ్యాన చిత్రీకరిస్తున్నారు. ఎస్వీ బాబు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి పలువురు సినీరంగ ప్రముఖులు విచ్చేశారు. ముందుగా నిర్మాత మాట్లాడుతూ షూటింగ్ పూర్తయిందని.. ఇంక ప్యాచ్ వర్క మాత్రమే మిగిలి ఉందని.. అది పూర్తవ్వగానే త్పరలోనే చిత్రాన్ని విడుదల చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం ఆర్పీ మాట్లాడుతూ గతంలో సంగీత దర్శకుడిగా పనిచేసిన తాను చిన్ననాటి నుంచి దర్శకుడిని కావాలనే తన కోరిక ఈ చిత్రం ద్వారా నెరవేరిందన్నాడు. ఈచిత్రంలో ఓ పాటను పది మంది దర్శకులు కలిసి ఆలపించారని చెప్పాడు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ అవకాశాల కోసం గతంలో సినీ పరిశ్రమ చుట్టూ కళాకారులు తిరిగే వారని.. అయితే ఇప్పుడా పరిస్థితి మారిందని చెప్పారు. సినీ పరిశ్రమే నేరుగా ప్రతిభ ఉన్న కళాకారుల కోసం అన్వేషించడం అభినందనీయం అని ఆయన ప్రశంసించారు.

ఈ చిత్రంలో రాజీవ్, అర్చనా గుప్త హీరోహీరోయిన్‌లుగా నటిస్తుండగా.. సాయికుమార్, కులశేఖర్, గండి బాబ్జి తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ వైజాగ్స్ ‌ఫైనల్స్‌కు చేరిన సమీర్, హరితలను న్యాయనిర్ణేతలు సత్కరించారు.