గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » ఆడియో విడుదలైన కృష్ణార్జున
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
Krishnarjuna Audio
WD PhotoWD
శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న కృష్ణార్జున చిత్రం పి వాసు దర్శకత్వ సారథ్యాన చిత్రీకరిస్తున్నారు. ఎం మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, మంచు విష్ణువర్థన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం ఆవిష్కరించారు. రామజోగయ్యశాస్త్రి, సాహితీలు సాహిత్యాన్ని ఇవ్వగా.. కీరవాణి సంగీతం దర్శకత్వంలో బాణీలను సమకూర్చారు.

ఈ చిత్ర ఆడియో విడుదల సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

నాగార్జున మాట్లాడుతూ మోహన్‌బాబు చాలా చిత్రాలను ఈ స్టూడియోలో తీసి... మా సంస్థకు గొప్ప ఎస్సెట్‌గా మారారని ఆయన పేర్కొన్నారు. హీరో చిక్కుల్లో ఉంటే భగవంతుడు ఏ విధంగా కాపాడాడు అన్నది ఈ చిత్రంలో కీలకాంశంగా తెరకెక్కించిన వైనం బాగుందన్నారు.

యువసామ్రాట్ నాగార్జున మాట్లాడుతూ ఇందులో తనది చాలా మంచి పాత్రగా వివరించాడు. మల్టీ స్టారర్ చిత్రాలు ఈ చిత్రంతో ఊపందుకోవాలని చెప్పాడు. మోహన్ బాబు మాట్లాడుతూ నాగార్జున అడిగిన వెంటనే కథ వినకుండానే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించడం నిజంగా తనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.