గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » కేఆర్ రత్నం దర్శకత్వంలో భూమ చిత్రం
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
Navaneethkour
WD PhotoWD
కేఆర్ రత్నం దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న భూమ చిత్రంలో నవనీత్ కౌర్, రామకృష్ణ తనయుడు శ్రీనివాస్‌లు హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శకుంతల నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విలేకరులేర్పాటు చేసిన సమావేశంలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఈ చిత్రానికి టైటిల్ తగ్గట్టుగా పేరు కుదిరిందని.. మాస్ ప్రేక్షకులతో పాటు లవ్, యాక్షన్ చిత్రాల ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకోగలదని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్ ఇస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా, మలేషియాలో ఈ చిత్ర పాటల చిత్రీకరణ ముగించామన్నారు.

హీరోకు ఈ చిత్రం మొదటిదే అయినా పాత్ర పరంగా ఎంతో అనుభవమున్న వాడిలా చేయడం బాగుందన్నారు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్లభరణి, తెలంగాణా శకుంతల, శివపార్వతి తదితరులు నటిస్తుండగా.. మాటలు వీఎస్పీ తెన్నేటి అందిస్తున్నారు.