1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

''సవాల్''లో వయ్యారి తూనీగ

సుహాని సవాల్ జయ బాలనటి నటన
'
WD
తూనీగా.... తూనీగా... ఎందాకా పరిగెడతావే... నా వంక...' అంటూ చిరు ప్రాయంలో చక్కటి అభినయం ప్రదర్శించిన సుహాని 'సవాల్' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేనాటికి సుహాని 17వ ఏటలోకి అడుగుపెట్టింది.

సుహాని మాట్లాడుతూ, 'కథానాయికగా తొలి పుట్టినరోజు ఇది. 45 చిత్రాల్లో బాలనటిగా నటించాను. హీరోయిన్‌గా జయ మేడమ్ చేతుల మీదుగా పరిచయం కావటం చాలా ఆనందంగా ఉంది. నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ఆమె సహకారం మరువలేనిది. గర్వంతో కూడిన క్యారక్టర్లో నటించాను' అని చెప్పింది.

'సవాల్' తర్వాత సుహాని బిజీ హీరోయిన్ అవుతుందని దర్శక నిర్మాతలు అన్నారు. ఈ చిత్రంలో ఇంకా షాయాజి షిండే, బ్రహ్మానందం, అలీ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి మూలకథ, మాటలు: పోలూరి ఘటికాచలం, సంగీతం: జెస్సీ గిఫ్ట్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: బి.జయ
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి