1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

వేణుమాధవ్ ప్రధాన పాత్రలో కొత్త చిత్రం

వేణుమాధవ్ ప్రధాన పాత్ర కొత్త చిత్రం
WD PhotoWD
హాస్యనటుడు వేణుమాధవ్ ప్రధాన పాత్రలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. మన్నేపల్లి శ్రీనివాస్ కథను అందించిన ఈ చిత్రం బెక్కెం వేణుగోపాల్, అశోక్ కుమార్ గౌడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతోంది.

పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెంటిమెంట్‌ పాళ్లు కూడా జోడిస్తున్నామన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే మిగిలిన వివరాలను కూడా త్వరలోనే తెలియపరుస్తామని పేర్కొన్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన హంగామా చిత్రంలో వేణుమాధవ్ హీరోగా వచ్చిన సంగతి విదితమే. సత్యభామ, టాటా బిర్లా మధ్యలో లైలా వంచి సూపర్ హిట్ చిత్రాలనందించిన లక్కీ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
About Writer
Hanumantha Reddy