1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

సంక్రాంతికి వస్తున్న "ఒక్కమగాడు"

నందమూరి బాలకృష్ణ హీరోగా వైవీఎస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన
FileFILE
నందమూరి బాలకృష్ణ హీరోగా వైవీఎస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన "ఒక్కమగాడు" చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నటించిన అందాల ముద్దుగుమ్మ అనుష్క తన అందాలను ఆరబోసిందని చిత్ర యూనిట్ చెపుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత వైవీఎస్.చౌదరి మాట్లాడుతూ... కష్టానికి తగిన ప్రతిఫలంగా నా గత చిత్రం "దేవదాసు"కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం విడుదలైన రెండేళ్ళకు 'ఒక్కమగాడు' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. 2006 డిసెంబరు 14వ తేదీన ప్రారంభించిన షూటింగ్.. 2007 డిసెంబరు ఐదో తేదీతో ముగించాం.

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీరామారావుని దృష్టిలో ఉంచుకుని 'సీతయ్య' చిత్రంలో ఒక్కమగాడు అనే పాటను రాయించాం. ఆ పాటలోని ఒక పల్లవినే ఈ చిత్రానికి టైటిల్‌గా ఖరారు చేసి, దీనికి "ఒన్ అండ్ ఓన్లీ" అనే ట్యాగ్‌ను తగిలించాం. చిత్రాన్ని చూసిన తర్వాత ఈ ట్యాగ్ బాలకృష్ణకు సరిగ్గా సరిపోతుందని ప్రేక్షకులే అంటారు.

గతంలో వచ్చిన నా చిత్రాలకు ఏ విధంగా కష్టపడ్డామో అలాగే.. ఈ చిత్రానికి కూడా శ్రమించాం. ఇప్పటికే విడుదలైన చిత్రం ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆడియో కంటే.. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్ని వైవీఎస్ అన్నారు. చంద్రబోస్ రాసిన పాటలకు మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని ఈనెల 11వ తేదీన విడుదల చేయనున్నారు.
About Writer
PNR