షూటింగ్ పూర్తయిన కృష్ణార్జున చిత్రం
|
అలాగే యువసామ్రాట్ నాగార్జున, ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి షూటింగ్ పూర్తయిన సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ నాగార్జున, విష్ణులు కృష్ణార్జునులుగా నటించారని చెప్పారు.
ఇందులో తాను ఓ వైవిధ్యమైన తమాషా పాత్రను పోషించానన్నారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ మల్టీస్టారర్ చిత్రాలు ఇలాంటివి చేస్తేనే కథలు కొత్తగా పుడతాయని చెప్పారు. ఈ చిత్రంలో ఇంకా భరణి, బ్రహ్మానందం, నాజర్, గిరిబాబు, ప్రేమ, రఘుబాబు, వేణుమాధవ్ తదితరులు నటింగా.. సంగీతం కీరవాణి అందిస్తున్నారు. అలాగే మాటలు మరుధూరి రాజు ఇస్తున్నారు.
