రీరికార్డింగ్ కార్యక్రమాల్లో ఒంటరి
|
ఈ సందర్భంగా పోకూరి బాబు రావు మాట్లాడుతూ ఇటీవలే రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాం.. త్వరలోనే మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రేమ అనే అంశంలో వచ్చే భావోద్వేగాలు వంటి కీలకాంశాలను ప్రధానంగా తెరకెక్కించామని రమణ తెలిపారు.
కుటుంబానికి దూరమైన ఒంటరి యువకుడిని పూర్తిగా ఒంటరి చేయడానికి కొంత మంది చేసే ప్రయత్నాన్ని ఆ యువకుడు ఒంటరిగా ఎలా ఎదుర్కొన్నాడు అన్న పాయింట్‌పై కథ నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ చిత్రంలో ఇంకా సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, ఆశిష్ విద్యార్ధి, సుప్రీత్, షిండ తదితరులు నటించగా మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.
