టాకీ పార్టు పూర్తి కానున్న నితిన్ ఆటాడిస్తా
|
మాదాపూర్‌లోని జయభేరి క్లబ్‌లో హీరో ఇంట్రొడక్షన్ ఫైట్‌ను రామ్‌లక్ష్మణ్ ఫైటర్స్‌తో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఓ చక్కని యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో ప్రధానంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల ప్యాచ్ వర్క్ మినహా మిగతా టాకీ పార్టు పూర్తయిందన్నారు.
ఇంకా నాలుగు పాటలు చేయాల్సి ఉంది. ఇందులో హీరోయిన్‌గా కాజల్ చాలా బాగా నటించిందని పేర్కొన్నారు. చక్రి చక్కటి బాణీలను అందించారని ఫిబ్రవరిలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అందరికీ నచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు ఈ చిత్రంలో ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
తర్వాత నితిన్ మాట్లాడుతూ దిల్ చిత్రం ఏ విధంగా అందరినీ ఆకట్టుకుందో.. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అదే రీతిలో ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.
