విడుదలకు సిద్ధంగా ఉన్న కృష్ణార్జున
|
పి వాసు దర్శకత్వ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి బాణీలను ఎంఎం కీరవాణి అందించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబు, అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్మించిన ఈ చిత్రాన్ని 275 ప్రింట్లతో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కాగా, విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రింట్లు అత్యధిక ప్రింట్లతో విడుదల కానుండటం ఇదే తొలిసారి. మోహన్‌బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. నాగార్జున వైవిధ్యమైన పాత్రలో సరికొత్త తరహాలో కనపడతారని గతంలో మోహన్‌బాబు ప్రెస్ మీట్‌లో చెప్పారు.
