1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

విశ్వతేజ, తుషలతో హ్యాపీ జర్నీ

మెగాస్టార్ చిరంజీవి విశ్వతేజ హీరో హ్యాపీ జర్నీ అన్నపూర్ణ స్టూడియోలో
WD PhotoWD
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి.. సోదరుడి కుమారుడైన విశ్వతేజ, హీరోగా హ్యాపీ జర్నీ చిత్రం గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. విశ్వతేజ సరసన తుష హీరోయిన్‌గా నటిస్తోంది. ఓం నమ:శ్శివాయ క్రియేషన్స్ పతాకంపై ఎన్ఆర్ఐ కేవీ రమణా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సభపతి దక్షిణామూర్తి దర్శకత్వ సారథ్యంలో రూపొందుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణస్టూడియోలో ప్రారంభమైన సందర్భంగా హీరో విశ్వతేజ మాట్లాడుతూ దర్శకుడు మంచి టాలెంట్ కలవారని వ్యాఖ్యానించాడు. అందుకే సభాపతి పేరు వినగానే మరో మాట మాట్లాడకుండా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశానని తెలిపాడు.

లేటెస్ట్ హైటెక్ యూత్ ఆలోచనలు ఎలా ఉన్నాయి.. ఎటు పయనిస్తున్నారు అన్న అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నారన్నాడు. రమణా రెడ్డి మాట్లాడుతూ రేపటి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మార్చికల్లా పూర్తి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అన్ని కార్యక్రమాలను ముగించుకుని మేలో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

చివరగా హీరోయిన్ తుష మాట్లాడుతూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని.. ఈ చిత్రంలో అవకాశం దక్కడం సంతోషంగా ఉన్నట్లు పేర్కొంది. శివాజీ రాజా మాట్లాడుతూ ఇరవైఏళ్ల నాడు అమెరికా వెళ్లిన రమణారెడ్డి తన జర్నీనే చిత్రంగా మలుస్తున్నారని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.
About Writer
Hanumantha Reddy