1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

చివరి అంకంలో తరుణ్, ఇలియానాల చిత్రం

ముప్ఫై శాతం తరుణ్
FileFILE
శ్రీలక్ష్మీదేవీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రం ముప్ఫై శాతం మినహా మిగిలిన టాకీ పార్టు పూర్తయింది. తరుణ్, ఇలియానాలు హీరోహీరోయిన్‌లుగా, ప్రధానంగా నటిస్తున్న ఈ చిత్రం విజయభాస్కర్ దర్శకత్వ సారథ్యాన రూపొందుతోంది.

శాఖమూరి పాండురంగారావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఆయనే నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ హాస్యరస ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. అలాగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో హీరోహీరోయిన్‌లపై పాటలు చిత్రీకరంచాల్సి ఉందని పేర్కొన్నారు.

అనంతరం చిత్ర పరిశ్రమలో లవర్ బోయ్‌గా పిలవబడుతున్న తరుణ్ మాట్లాడుతూ తను హీరోగా నటించిన తొలి చిత్రం 'నువ్వే కావాలి'కి విజయభాస్కర్ దర్శకత్వం వహించారని.. ఈ చిత్రానికి కూడా అయన దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందని తెలిపాడు.

తర్వాత ఇలియానా మాట్లాడుతూ ఈ చిత్రంలో అది తరుణ్‌తో నటించడం ఎంతో థ్రిల్‌గా ఉందని.. తురణ్ స్నేహ స్వభావం కలవారని చెప్పింది. చివరగా నిర్మాత మాట్లాడుతూ త్వరలోనే ఆడియోతో పాటు చిత్ర టైటిల్‌ను కూడా ప్రకటిస్తామన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మేలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో ఇంకా బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ప్రదీప్ సింగ్ రావత్, ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు నటిస్తుండగా.. సంగీతం కేఎం రాధాకృష్ణ అందిస్తున్నారు.
About Writer
Hanumantha Reddy