1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

మాధవన్, భావన జంటగా ''ఆర్య ఎం.బీ.బిఎస్''

మాధవన్ భావన ఒంటరి తమిళం ఆర్య ప్రకాష్‌రాజ్
WD
మాధవన్, ఒంటరి ఫేమ్... భావన జంటగా బాలశేఖరన్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘనవిజయం సాధించిన ఆర్య చిత్రాన్ని 'ఆర్య ఎంబీబిఎస్' పేరుతో రేఖా కంబైన్స్ సమర్పణలో తేజా సినిమా పతాకంపై సి.వి.రావు, పత్సనాగరాజు అందిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తయి తొలికాపీ సిద్ధమైంది.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్ పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో 5 పాటలు, మూడు ఫైట్స్ ఉన్నాయి. మణిశర్మ బాణీలు సమకూర్చారు. డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో ఆడియో, నెలాఖరుకి సినిమాను విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమేరా- గుహన్, పాటలు- భువనచంద్ర, మాటలు- వెన్నెలకంటి
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT