1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

విడుదలకు సిద్ధంగా ఉన్న ఒంటరి

బీవీ రమణ పోకూరి బాబురావు గొపీచంద్ ఆదిత్య మ్యూజిక్
FileFILE
బీవీ రమణ దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న ఒంటరి చిత్రాన్ని పోకూరి బాబురావు నిర్మించారు. గొపీచంద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో భావన హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఆదిత్య మ్యూజిక్ మార్కెటింగ్ చేస్తోందని పేర్కొన్నారు. అనురాగం.. ఆప్యాయత.. ప్రేమ కలగలిపి ఉన్న కుటుంబంలోని వ్యక్తి కథే ఈ చిత్రమన్నారు.

సాంప్రదాయ కుటుంబంలోని ఓ వ్యక్తిని ఒంటరి చేయాలనుకునే భావన శత్రువులకు ఎందుకు కలిగింది..? దానిని ఒంటరిగా ఆ వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు..? అనే దానిపై కథ సాగుతుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి నెల 14న విడుదల చేయాలనకుంటున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో ఇంకా పరుచూరి వెంకటేశ్వరరావు, నరేష్, ఆశిష్ విద్యార్థి, రజిత, సునీల్, ఆలీ, రాజా రాఘవేంద్ర తదితరులు నటిస్తుండగా.. మారుధూరి రాజా మాటలు అందిస్తున్నారు.
About Writer
Hanumantha Reddy