1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

22న "మంగతాయారు టిఫిన్ సెంటర్"

ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో నిర్మితమైన
FileFILE
ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో నిర్మితమైన "మంగతాయారు టిఫిన్ సెంటర్" చిత్రం ఈనెల 22వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పైడిబాబు వెల్లడించారు. సతీష్ పవార్ సమర్పణలో వెంకీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పైడిబాబు మాట్లాడుతూ.. చిత్ర రీరికార్డింగ్, డిటిఎస్.మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుతున్నాం. మిగితా పనులు త్వరగా పూర్తి చేసి ఈనెల 22వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు.

శ్రీలేఖక సంగీత సారథ్యంలో ఇటీవలే మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చినట్టు చెప్పారు. బాధ్యత గల పౌరురాలిగా వున్న ముమైత్ ఒక టిఫిన్ సెంటర్‌ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నదే ఈ చిత్రం కథ అని ఆయన వివరించారు. ఈ చిత్రానికి మాటలు వేగేశ్న సతీష్, కెమెరా..డి.ప్రసాబాబు, ఎడిటింగ్.. రమేష్, ఆర్ట్.కె.మురళీధర్, నిర్మాతలు..పైడిబాబు, సిహెచ్.రమేష్, గురురాజ్, కథ, స్క్రీన్, దర్శకత్వం... వెంకీ.
About Writer
PNR