1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. 'మాయ' చేయటానికి వస్తున్న నమిత

''మాయ'' చేయటానికి వస్తున్న నమిత

నమిత ప్రేక్షకులు పాత్ర మాయ చిత్రం
ప్రేమ ప్రధానాంశంగా హార్రర్, సస్పెన్స్ మిళితం చేసి నమిత ప్రధాన పాత్రలో అమెరికన్ పిక్చర్స్ సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన 'మాయ' చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎరిక్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో నమిత అద్భుతమైన పాత్రను పోషించింది. ఒక మిస్టీరియస్ ప్రదేశంలో జరిగే ఈ కథలో ఎన్నో సాహసాలు, ప్రేక్షకులను థ్రిల్ చేసే ఎన్నో అంశాలు ఉంటాయి.

ప్రేమ నేపథ్యంలో సాగే సినిమా అంతా ఊటీలోని అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించామ"న్నారు. శుభలేక సుధాకర్ ముఖ్యపాత్రలో నటించారు. కెనడా, బల్గేరియా, అమెరికాకు చెందిన నటీనటులు ఈ చిత్రంలో నటించటం విశేషం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT