1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

''రేస్''తో దూసుకు రానున్న కత్రినా

రేస్ కత్రినాకైఫ్ సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్
గత ఏడాది వరుసగా నాలుగు హిట్లు కొట్టిన కత్రినా కైఫ్ 'రేస్' చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌తోసహా అందరు హీరోలతో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సెక్సీ భామ చెబుతోంది. టీనేజ్ ప్రేక్షకుల కలల రాకుమారి కత్రినా నటించిన రేస్ సినిమా విడుదలకు సిధ్ధంగా ఉంది. కత్తి లాంటి కత్రినా సరసన సైఫ్అలి‌ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.

సైఫ్‌తో కత్రినా చేసిన సెక్సీ సాంగ్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని స్వయంగా కైఫ్ చెబుతుంది. రేస్ సినిమా చాలా డిఫరెంట్ సినిమా అని, రొమాంటిక్, కామెడీ సినిమా కాదని, యాక్షన్, థ్రిల్లర్ సినిమా అని, తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని అంటోంది. తనకు అనిల్ కపూర్, అక్షయ్, సన్నీడియోల్, గోవిందాలంటే ఇష్టమని వారితో కలిసి నటించటానికి ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT