1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

జల్సా మొబైల్ గేమ్స్ విడుదల

పవన్ కల్యాణ్ నటించి జల్సా చిత్రం వ్యాపార రంగం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది వెల్లడించారు శనివారం ఐటెక్స్‌ బిజినెస్
WD
పవన్ కల్యాణ్ నటించిన జల్సా చిత్రం వ్యాపార రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మొబైల్‌లో రింగ్‌టోన్స్‌‌కు మాదిరిగానే మొబైల్ గేమ్స్‌ను ప్రవేశపెట్టింది. అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం ఐటెక్స్‌లోని బిజినెస్ కన్వెక్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సినిమా రంగంలో కొత్త వ్యాపారధోరణికి శ్రీకారం చుట్టాం. స్పైడర్‌మాన్ మనకందరికీ పుస్తకాల ద్వారా తెలుసు, ఆ తర్వాత సినిమాలు, కార్టూన్స్, షోలు, బొమ్మలు ఇలా రకరకాలుగా వాటితో వ్యాపారం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తొలిసారిగా మొబైల్ గేమ్స్‌ను ఏర్పాటు చేశాం.

ఎఫ్. ఎక్స్ ల్యాబ్స్ ఈ యానిమేషన్ గేమ్‌ను రూపొందించింది. అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లతో పాటు 11 మంది సభ్యులుగా ఏర్పడి ఈ యానిమేషన్ గేమ్‌ను రూపొందించారు. సినిమా వ్యాపారంలో ఇటువంటి ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్ మరిన్ని చిత్రాలు ఈ తరహాలో చేయాలనుకుంటున్నామని తెలిపారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, త్వరలోఆన్‌లైన్ గేమ్‌ను కూడా ప్రవేశపెట్టనున్నామనీ, మొబైల్ గేమ్‌ను 50 రూపాయలకే అందజేస్తున్నామనీ, దీనికి కోట్ ఉంటుందనీ, బ్లూటూత్‌తో మరొకరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలులేదని తెలిపారు.

అర్జున్ మాట్లాడుతూ, నాకు మొదటి నుంచి యానిమేషన్ అంటే ఇష్టం. అనుకోకుండా హీరో అయ్యాను. పదేళ్లనాడు మన సినిమాలకు దీన్ని అప్లయ్ చేయాలనుకున్నాను. అది ఈనాటికి నెరవేరింది. యానిమేషన్ రంగం ఆంధ్రప్రదేశ్‌లో వ్యాప్తిచెందుతోంది. భవిష్యత్ యానిమేషన్‌దే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఎక్స్ ల్యాబ్స్ ప్రతినిధి శశిరెడ్డి, జాక్సన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.
About Writer
Gayathri