1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

బాలయ్య భక్తిరస చిత్రం "పాండురంగడు"

బాలయ్య బాలకృష్ణ భక్తిరస చిత్రం పాండురంగడు
ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను ఎదుర్కొన్న నందమూరి బాలయ్య ఒక భక్తిరస చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భక్తిరసా చిత్రాలు తీయడంలో దిట్ట అయిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పాండురంగడు చిత్రం రూపొందుతోంది. దీని పూర్తి వివరాలను ఉగాది శుభదినాన తెలియజేయాలని దర్శకేంద్రులు భావిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ భక్త పుండరీకునిగా, శ్రీకృష్ణునిగా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. హీరోయిన్ల విషయానికొస్తే హొమ్లీ గర్ల్ స్నేహ, టబు నటిస్తున్నారు. ఈ చిత్రంలో వేశ్యగా టబు నటించడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రానికి భారవి, వేటూరి, సుద్దాల అశోక్ తేజ, వేదవ్యాస్ కలాల నుంచి జాలువారే పాటలు ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.

గతంలో ఈ తరహా వైవిధ్య పాత్రలలో వచ్చిన ఆదిత్య 369, భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం సూపర్ హిట్ అయ్యాయి. ఇన్నాళ్ళకు అదే తరహాలో రాబోతున్న పాండురంగడు చిత్రం కూడా బాలయ్య నటనాచాతుర్యంతో సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని ఆశిద్దాం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT