1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

మే నెలలో బ్లాక్ అండ్ వైట్

రాజీవ్ కనకాల సింధుతులానీ బ్లాక్ అండ్ వైట్
WD
రాజీవ్ కనకాల, సింధుతులానీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం బ్లాక్ అండ్ వైట్. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీష్రాఫ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ నెలఖరునగానీ, మే నెల మొదటివారంలోగానీ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమ, యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు చెప్పారు. జాకీ ఇందులో పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారనీ.... అస్త్రం, బ్యాంక్ చిత్రాల తర్వాత జాకీష్రాఫ్ నటిస్తున్న చిత్రమిదని తెలిపారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT