మేలో ''కంత్రీ'' విడుదల..?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'కంత్రీ' చిత్రంలో హన్సిక, తనూజ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.వైజంతీ మూవీస్ బేనరుపై అశ్వనీదత్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరకల్పన చేశారు.
భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, ఈ చిత్రం యూత్‌ఫుల్‌గానే గాక... ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 'కంత్రీ' ఆడియో విడుదల చేసినప్పటికీ.. ఒక గంట సమయంలోనే క్యాసెట్లు, సీడీలు భారీగా అమ్ముడుపోవడం విశేషం.