1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

మే నుంచి '' పరుగు '' పెట్టనున్న అల్లు అర్జున్

మే పరుగు పెట్టనున్న అల్లు అర్జున్
WD PhotoWD
అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన పరుగు చిత్రం కార్మిక దినోత్సవమైన మేడే నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుస విజయాలు సాధిస్తున్న అల్లు అర్జున్ కెరీర్‌లో మరో బెస్ట్ ఫిల్మ్‌గా ఈ చిత్రం నిలిచిపోనుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో పరుగు చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ చిత్రం చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో సందర్భానుసారంగా పాటలు ఉండడం విశేషమని ఆయన తెలిపారు.

దర్శకుడు భాస్కర్ చిత్రం గురించి మాట్లాడుతూ అనుకున్న విధంగా చిత్రం తీయగలిగామని అన్నారు. అల్లు అర్జున్ తనకు ఆర్య చిత్రం గురించి తనకు బాగా తెలుసని, తనతో చిత్రమంటే డాన్స్‌కు ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో కూడా మంచి డాన్స్ ఉందని ఆయన తెలిపారు.

ఈ చిత్రం కోసం తాను యూనిట్‌ని పరుగు పెట్టించానని, విడుదల తర్వాత చిత్రం ఎలా పరుగు పెడుతుందో ప్రేక్షకులే నిర్ణయించాలని ఆయన అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి మణిశర్మ సమకూర్చిన సంగీతం బాగా వచ్చిందని అన్నారు. రీరికార్డింగ్ సైతం అద్భుతంగా వచ్చిందని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే గిర గిర తిరిగేనైజం... అనే పాటలో హీరో పాత్ర గురించి తెలిసిపోతుందని అన్నారు.
About Writer
Munibabu