1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

మధుర ఎంటర్‌టైన్ ద్వారా కుర్‌కురే ఆడియో విడుదల

మధుర ఎంటర్‌టైన్ కుర్‌కురే ఆడియో
WD PhotoWD
దువ్వాసి మోహన్ నిర్మించి నటిస్తున్న కుర్‌కురే చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. మధుర ఎంటర్‌టైన్‌మెట్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది.

ఈ చిత్రంలో దువ్వాసి మోహన్‌తో పాటు భువనేశ్వరి ప్రధాన పాత్రలో నటిస్తోంది. కుర్‌కురే అనే ఈ చిత్రం పేరుకు అంతా కిరికిరే అనే ఉపశీర్శిక పెట్టారు. ఈ చిత్ర విశేషాల గురించి చిత్ర దర్శకుడు జునైద్ మాట్లాడుతూ ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం వేసవిలో చక్కని వినోదాన్ని పంచనుందని అన్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే తొలికాపీ సిద్ధం కానుందని ఆయన చెప్పారు. మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ చిత్రానికి రాజేశ్వరి సమకూర్చిన సంగీతం బాగా వచ్చిందని, సంగీతం సైతం ఈ చిత్ర విజయానికి దోహదం కానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
About Writer
Munibabu