1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

విడుదలకు సిద్ధమైన బ్రహ్మానందం డ్రామా కంపెనీ

విడుదల సిద్ధం బ్రహ్మానందం డ్రామా కంపెనీ
WD PhotoWD
శివాజీ, రవికృష్ణ హీరోలుగా, కమిలినీ ముఖర్జీ, సమీక్ష హీరోయిన్లుగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం బ్రహ్మనందం డ్రామా కంపెనీ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

మే 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విశేషాల గురించి తెలియజేయడానికి ఇటీవల ఫిలింఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన పల్లి కేశవరావు మాట్లాడుతూ మే 17న తమ చిత్రం సెన్సార్ కార్యక్రమం జరుపుకోనుందని తెలిపారు.

చిత్ర దర్శకుడు ఐ. శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నాటక కంపెనీకి అధినేతగా నటించే బ్రహ్మానందంకు ముప్పై ఏళ్ల నాటకరంగ అనుభవం ఉంటుందని అన్నారు. అలాంటి బ్రహ్మానందం తను డ్రామా వేస్తే ఇక ఎవరినీ నిద్ర పోనివ్వడు. అలాంటి ఆ డ్రామా కంపెనీ నుంచి హీరోయిన్ మిస్ అవుతుంది.

దీంతో ఎవరైతే హీరోయిన్‌ని తెస్తారో వారిని హీరోగా చేస్తానని బ్రహ్మానందం చెప్పడంతో ఓ పిచ్చి అమ్మాయిని తెచ్చి హీరోయిన్‌ని చేస్తారు. అయితే మొదటి హీరోయిన్ ఎందుకు మిస్ అయ్యింది. పిచ్చమ్మాయిని ఎవరు తీసుకొచ్చారు. అనేవి చిత్రంలో ఆసక్తిగా ఉంటాయని ఆయన అన్నారు.

హీరో రవికృష్ణ మాట్లాడుతూ బడ్జెట్ చూడకుండా క్వాలిటీ కోసం పూర్తిగా బ్యాంకాంగ్‌లో నిర్మించిన చిత్రమిదని అన్నారు. కామెడీతో పాటు యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచారని ఆయన చెప్పారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ శ్రీరామచంద్రులు చిత్రం తర్వాత తాను బాగా ఇష్టపడి చేసిన చిత్రమని తెలిపారు.

మరో నిర్మాత కిషోర్ మాట్లాడుతూ క్లైమాక్స్‌లో ఎపెక్ట్ కోసం కొన్ని సన్నివేశాలను రీషూట్ చేశామని అందుకే చిత్రం ఆలస్యమైందని చెప్పారు. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ చిత్రానికి మాటలు- రమేష్‌గోపి, కెమెరా- పి.ఎస్.బాబు, సంగీతం- సాయికార్తీక్, ఎడిటర్- వి. నాగిరెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- ఐ. శ్రీకాంత్.