విడుదలకు సిద్ధమవుతున్న 'సుల్తాన్ ది వారియర్'
|
ఈ చిత్రానికి రజినీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించడం విశేషం. వివిధ కార్పోరేట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందింది. యానిమేషన్ చిత్రాల వరుసలో ఈ చిత్రం రికార్డు సృష్టించడం ఖాయమని ఈ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.
ఈ చిత్రం విశేషాల గురించి దర్శకురాలు సౌందర్య మాట్లాడుతూ తాము అనుకున్నదానికన్నా ఈ చిత్రం మరింత గొప్పగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రం విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించనున్నట్టు ఆమె తెలిపారు.

