1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

జూన్ ఆరు నుంచి అధ్యక్షా..! అందరికీ వందనాలు

జూన్ ఆరు అధ్యక్షా అందరికీ వందనాలు
WD PhotoWD
బ్రహ్మాజీ, జీవా, రఘుబాబు హీరోలుగా విజయచందర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోన్న చిత్రం అధ్యక్షా..! అందరికీ వందనాలు. భవిష్య ఆర్ట్ బేనర్‌పై రచయిత మరుధూరి రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రం విశేషాల గురించి నిర్మాత వలవలి జగన్నాథరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని జూన్ ఆరున ప్రేక్షకుల ముందుకు తేనున్నామని తెలిపారు. సమాజంలో జరుగుతున్న సమస్యలను సృశిస్తూ మరుధూరి రాజా ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో ఉత్తేజ్, బ్రహ్మానందం, వేణుమాథవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, నర్రా, విజయరంగరాజు తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా- శంకర్ కంతేటి, సంగీతం- సాయికార్తీక్, పాటలు- రవిరాజ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- మరుధూరి రాజా.