1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

జూన్ 13న ప్రేక్షకుల ముందుకు ''దశావతారం''

జూన్ 13 ప్రేక్షకుల దశావతారం
WD PhotoWD
కమల్‌హాసన్ పది విభిన్నమైన పాత్రలతో నటిస్తోన్న దశావతారం చిత్రం జూన్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆస్కార్ రవిచందర్ నిర్మాతగా కె.ఎస్. రవికుమార్ దర్శకునిగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను కమల్ స్వయంగా సమకూరుస్తున్నారు.

ఈ చిత్రం గురించి కమల్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నట్టు తెలిపారు. దాదాపు రెండేళ్లకు పైగా ఈ చిత్రం షూటింగ్ జరపాల్సి వచ్చినా దర్శకుడు ఏమాత్రం విసుగు చెందలేదని షూటింగ్ ప్రారంభం రోజున చూపించిన అదే ఉత్సాహాన్ని చివరిరోజు వరకు చూపించారని కమల్ పేర్కొన్నరు.

అలాగే ఈ చిత్రం నిర్మత ఆస్కార్ రవిచందర్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని కమల్ తెలిపారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రెషమ్మియా సంగీతాన్ని సమకూర్చడం కూడా ఓ గొప్ప విషయమని ఆయన అన్నారు.

దర్శకుడు రవికుమర్ మాట్లాడుతూ ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేశారని తెలిపారు. హాలీవుడ్ చిత్రాలైన టైటానిక్, వాటర్ వరల్డ్ చిత్రాలకు పనిచేసిన కళాకారులు ఈ దశావతారం చిత్రానికి పనిచేయడం గొప్పవిషయమని ఆయన అన్నారు. అలాగే ఈ చిత్రంలో వైట్‌హౌస్ సెట్‌ను కళా దర్శకుడు తోటతరణి అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు.
చిత్రంలో వచ్చే 12శతాబ్ధానికి చెందిన విష్ణుమూర్తి ఆలయాన్ని పోలిన సెట్ కూడా ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఇన్ని గొప్ప అంశాలను కలిగిన ఈ చిత్రం జూన్ 13న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 1000 ప్రింట్లతో విడుదల కానుందని ఆయన తెలిపారు.
About Writer
Munibabu