1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

జూన్ 19న రావడానికి రామ్, జెనీలియా ''రెడీ''

జూన్ 19న రావడానికి రామ్
WD PhotoWD
రామ్, జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన రెడీ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దేనికైనా అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. దేవదాసు, జగడం చిత్రాల తర్వాత హీరో రామ్ తన మూడో చిత్రంగా రెడీతో రానున్నాను.

బొమ్మరిల్లు తర్వాత కేరీర్‌లో మంచి దశలో ఉన్న జెనీలియా ఈ చిత్రం ద్వారా మళ్లీ ఈ చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న శ్రీనువైట్ల ఢీ, దుబాయిశీను చిత్రాల సక్సెస్ తర్వాత ఈ రెడీ చిత్రంతో హ్యాట్రిక్ కోసం వేచిచూస్తున్నారు.

ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ చిత్రం విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ దేనికైనా రెడీ అనే టైపులో హీరో రామ్ క్యారెక్టర్ ఉంటుందని తెలిపారు. డీ చిత్రం తర్వాత అదే టైపులో పుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
About Writer
Munibabu