''విక్టరీ''తో జూన్ 27న ప్రేక్షకుల ముందుకు నితిన్
|
ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు రవి.సి.కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఈ చిత్రానికి చక్రి సమకూర్చిన స్వరాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఈ చిత్రం ద్వారా అందించనున్నట్టు ఆయన తెలిపారు.
నితిన్ అభినయం చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో శశాంక్, సింధూతులానీలు మరో జంటగా నటిస్తున్నారు. వీరితోపాటు చిత్రంలోని ఇతర పాత్రల్లో భరణి, రఘబాబు, అశుతోష్‌రాణా, ఎం.ఎస్.నారాయణ, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్నారు.
