1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

''మిషన్ ఇస్తాంబుల్''లో అందాల శ్రేయ

'మిషన్ ఇస్తాంబుల్'లో అందాల శ్రేయ
WD
తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒకే ఒక్క సినిమా చేస్తే చాలు... హీరో సంగతి ఎలా వున్నా... హీరోయిన్ మాత్రం బాలీవుడ్, హాలీవుడ్ అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్రస్థానానికి చేరుకుంటారు. ఇందుకు మంచి ఉదాహరణ ఐశ్వర్యారాయ్. ఇప్పుడు ఐశ్వర్యకు పట్టిన అదృష్టం లాంటిదే శ్రేయకు పట్టినట్లు కనబడుతోంది. ఆమెను బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.

పాప్‌కార్న్ మోషన్ పిక్చర్స్, బాలాజీ టెలీఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న 'మిషన్ ఇస్తాంబుల్' చిత్రంలో శ్రేయ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్, సునీల్ షెట్టీ, షబ్బిర్ బోక్స్‌వాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు అపూర్వ లాఖియా మాట్లాడుతూ, జర్నలిస్టు నేపధ్యంలో కథ సాగుతుందన్నారు.

వివేక్ ఒబెరాయ్, జాయెద్ ఖాన్, సునీల్ షెట్టీలతోపాటు దక్షిణాది తార శ్రేయ నటన ఆకట్టుకుంటుందన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 25న విడుదల చేయటానికి చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ శ్రేయా...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT