జూన్ 26న ''కొంచెం కొత్తగా'' రానున్న వెంకట్
|
ఈ చిత్రం విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రంలో సగం మాటలే ఉండవు. సగం తర్వాత పాటలూ ఉండవు అని తెలిపారు. అందుకే ఈ చిత్రానికి కొంచెం కొత్తగా అనే టైటిల్ పెట్టామని పేర్కొన్నారు. సస్పెన్స్, మర్డర్, కామెడీతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఆయన తెలిపారు.
తక్కువ పాత్రలతో రూపొందిన ఈ చిత్రానికి ఎక్కువ ట్రీట్‌మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. హీరో వెంకట్ మాట్లాడుతూ చాలా గ్యాప్ తర్వాత తెలుగు చిత్రం చేస్తునన్నారు. ఈ చిత్రంలో మొదటి అర్ధబాగం హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సాంకేతికంగా విలువలు ఉన్న చిత్రమిదని అన్నారు.
థ్రిల్లర్ చిత్రాలను రాత్రిపూట భయపెట్టేలా తీస్తారని అయితే ఈ చిత్రం పగలు కూడా భయపెట్టేలా రూపొందించామన్నారు. ఈ చిత్రానికి కెమెరా- ఎస్. అరుణ్‌కుమార్, సంగీతం- రాజు రావ్, కథ- కె. ఆనంద్.
