1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

''జర్నీ''కోసం వర్షంలో పరుగెడుతున్న జెనీలియా

'జర్నీ'కోసం వర్షంలో పరుగెడుతున్న జెనీలియా
WD
బోయ్స్ చిత్రం ద్వారా టీనేజ్ కుర్రకారు హృదయాలలో గుబులు రేపిన జెనీలియా మరోసారి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దరర్శకత్వంలో నటిస్తోంది. కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్‌పై సుంకర మధుమురళి నిర్మిస్తోన్న 'జర్నీ' చిత్రంలో తరుణ్‌కు జోడీగా చేస్తోంది. ఖడ్గం తర్వాత కృష్ణవంశీతో సుంకర మధుమురళి నిర్మిస్తున్న చిత్రమిది.

రోడ్డు ప్రయాణం నేపధ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ జర్నీ చిత్రానికి సంబంధించి గత కొద్దిరోజులుగా అమరావతి రోడ్డుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడే వున్న అమరేశ్వరుని దేవాలయంలో మరికొన్ని సన్నివేశాలు, రోడ్డుపై వర్షంలో జెనీలియా పరుగెడుతుండగా ఛేజింగ్ దృశ్యాలను తెరకెక్కించారు. జూలై 8 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ చిత్రానికి కెమేరా: భాస్కర్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT