నిండు పౌర్ణమిలోగా వికసించిన "నెలవంక" ప్రేమ
అనుష్క ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న "నెలవంక" చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని చిత్రయూనిట్ తెలిపింది. అనిష్ తేజశ్వర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు నాగేష్ వారదాశి మాట్లాడుతూ... ప్రేమ అనే రెండక్షరాల స్పందన ఒక జంటలో ఎలాంటి పరిస్థితులలో కలిగింది.
ఆపై వాళ్ళు రాష్ట్రాలు దాటి విడిపోవడం, అనుకోని పరిస్థితుల్లో కలవడం, కలిసినా తెలియకపోవడం, తెలిసే సమయానికి మళ్ళీ దూరం కావడం... ఆచూకీ తెలిసిన హీరో ప్రక్క రాష్ట్రంలోని తన ప్రియురాలి కోసం వెళ్ళి ఎలాంటి ఇబ్బందులకు లోనయ్యాడు? నెలవంక రోజు మొదలైన ప్రేమ నిండు పౌర్ణమిలోగా ఎలా వికసించింది... అని తెలుసుకోవాలంటే నెలవంక చిత్రాన్ని తప్పక చూడాల్సిందే.. అని చెబుతున్నారు.
జూలై మొదటివారంలో ఆడియో, నెలాఖరున చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు దర్శకులు చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ.. మధు, ఎ. నాయుడు, సంగీతం.. సాయి కార్తీక్.