1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

మలేషియా వెళ్లనున్న "ప్రేమోత్సవం"

మలేషియా వెళ్లనున్న ప్రేమోత్సవం
WD PhotoWD
యువ కథానాయకుడు శ్రీరామ్ హీరోగా యూంక్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న "ప్రేమోత్సవం" చిత్రం మలేషియా వెళ్ళనుంది. జూన్ 6న ప్రారంభమైన ఈ చిత్రం, ఈ నెల 21వరకు హైదరాబాద్‌లోని అంబేద్కర్ యూనివర్శిటీ, బేగంపేట ఎయిర్‌పోర్ట్, లహరి రెస్టార్ట్స్, రావి నారాయణ రెడ్డి ఆడిటోరియం, జూబ్లీహిల్స్ రోడ్స్‌లోనూ ఇంకా నగరంలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. తిరిగి ఈ చిత్రం రెండో షెడ్యూల్ జూలై 15 నుంచి ఆ నెలాఖరు వరకు మలేషియాలో జరుపుకోనుంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్వర్ మాట్లాడుతూ... ఇది అందమైన సినిమా అని, గతంలో తాను తీర్చిదిద్దిన "మౌనహృదయం"లాగా ఒక చక్కని కథతో దీన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి రూపొందిస్తున్నట్లు అన్నారు. మొదటిసారి హైదరాబాద్‌లో షూటింగ్ చేయడం జరిగిందని, ఈ లొకేషన్స్, ఈ నేటివిటీ తమకెంతో నచ్చాయని, అనుకున్న విధానికంటే మరో పదిశాతం ఎక్కువగానే షూటింగ్ జరపడం జరిగిందని అన్నారు.

ముఖ్యంగా శ్రీరామ్-నమితల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని, అలాగే శ్రీరామ్ పాల్గొన్న దృశ్యాల్ని నమిత మీద ఒక పాటను, ఇంకా కొన్ని కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో జరిగే దృశ్యాన్ని చిత్రీకరించడం జరిగింది. దీని తర్వాత మలేషియా ప్రాంతాలకు జూలై నెలలో వెళ్లి, అక్కడ శ్రీరామ్, నమితల మీద కొన్ని పాటల్ని, కథకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు దర్శకుడు అన్నారు. ఆగస్టు నెలలో తిరిగి హైదరాబాద్‌లో చేసే షెడ్యూల్త్‌తో టాకీ పూర్తవుతుందని, పాటల్ని మాత్రం తర్వాత షెడ్యూల్‌లో పూర్తిచేస్తామని చెప్పారు.

నిర్మాత అశోక్ కె. కొట్వాని మాట్లాడుతూ... గతంలో "మౌన హృదయం" వంటి చక్కని సినిమాని రూపుదిద్దిన రాజేశ్వర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని, ఇందులో యువతకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో జరుపనున్న షెడ్యూల్‌కు అనంతరం ఆడియో క్యాసెట్‌ను రిలీజ్ చేయడంతో పాటు, సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ... కమర్షియల్ విలువలతో కూడిన కలర్‌ఫుల్ చిత్రమిదని, కార్పొరేట్ కంపెనీలో పనిచేసే కుర్రాడిగా తన పాత్ర కొనసాగుతుందని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత సంజీవ్ శర్మ మాట్లాడుతూ... తొలి ప్రయత్నంలోనే మంచి కథతో యంగ్ హీరో శ్రీరామ్‌తో చేయిస్తున్నామని చెప్పారు. శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నమిత కథానాయకి కాగా, హేమమాలిని అనే కొత్త అమ్మాయి మరో నాయికగా పరిచయం కాబోతుందని అన్నారు. రాయేషా, శృతి, అనీల్, రఘుబాబు, నాజర్, వివేక్ తదితరులు నటిస్తున్నారు.