జూలై 11న వస్తున్న "బ్రహ్మానందం డ్రామాకంపెనీ"
|
శివాజీ, రవికృష్ణ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో హాస్యబ్రహ్మ కీలక పాత్ర పోషిస్తున్నారని నిర్మాతలు వెల్లడించారు. గత సినిమాల్లో విజయాలను తన భుజాలపై వేసుకున్నట్లు ఈ చిత్రం కూడా ఆయన పాత్రతో విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ... శ్రీరామచంద్రులు తర్వాత మళ్ళీ అంతటి కామెడీ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఈ చిత్రాన్ని బి. గురునాథ రెడ్డి సమర్పిస్తుండగా, సోమా విజయప్రకాష్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
