1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

జూలై రెండో వారంలో "మా ఆయన చంటి పిల్లాడు"

జూలై రెండో వారం మా ఆయన చంటి పిల్లాడు శివాజీ  మీరాజాస్మిన్
WD PhotoWD
భార్య దేన్నైనా సహిస్తుంది గానీ.. సవతి పోరును మాత్రం క్షమించదు. భర్త శ్రీరాముడైతే చంటిపిల్లాడిలా చూసుకుంటుంది. రెండితలు కష్టపడి భర్తకు కష్టం లేకుండా చేస్తుంది. అదే శ్రీకృష్ణుడైతే ఏ మాత్రం సహిస్తుంది. ఇదే కథానేఫథ్యంలో "మా ఆయన చంటి పిల్లాడు" చిత్రం రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమా గురించి దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ.. పరస్త్రీ వ్యామోహంలో పడిన భర్తను ఓ ఇల్లాలు ఎలా దారికి తెచ్చుకుంటుందన్న పాయింట్‌తో సినిమాను తెరకెక్కించామని అన్నారు. శివాజీ, మీరాజాస్మిన్ భార్యభర్తలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంగీత మరో కథానాయికగా నటిస్తోందని అన్నారు.

లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, ప్రస్తుతం డిటియస్ కార్యక్రమాలు జరుపుకుంటోందని రాజా వన్నెంరెడ్డి చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సారథి విజయ ప్రకాశ్ తెలిపారు. శ్రీలేఖ అందించిన పాటలు ఇప్పటికే శ్రోతల ఆదరణ పొందాయని అన్నారు.
About Writer
Selvi