1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

రామ్, హాన్సికల మస్కా

రామ్ హాన్సిక మస్కా ఎంఎస్ రాజు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
WD
'దేవదాసు'తో సంచలనం సృష్టించిన యువహీరో రామ్ మరోసారి 'మస్కా' చిత్రంతో ముందుకు రానున్నాడు. మెగా ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన హాన్సిక నటిస్తోంది. బి. గోపాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పది రోజులపాటు షూటింగ్ జరుపుకుంది.

ఈ చిత్రం గురించి మెగా మేకర్ రాజు మాట్లాడుతూ.... 'మస్కా' టైటిల్‌కి తగ్గట్లుగా డిఫరెంట్ ట్విస్టులతో చాలా ఇంటరెస్టింగ్‌గా వుంటుంది. యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన హాన్సిక ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్‌కోసం అన్వేషిస్తున్నాం" అన్నారు.

రామ్, హాన్సికతోపాటు నరేష్, సునీల్, ముఖేష్, రుషి, ప్రదీప్, రావత్, ఎం.ఎస్. నారాయణ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: సూర్య, రచన: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చక్రి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.గోపాల్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT