18న ప్రేక్షకుల ముందుకు "కృషి"
|
నిర్మాత మాట్లాడుతూ... ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతల మెప్పును పొందాయని, చిత్రం కూడా మరింత ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు. చిత్రం గురించి చెప్పాలంటే, కృషి అనే పదం వింటేనే ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుందని, త్రికరణశుద్ధిగా కృషి చేయాలనే పాయింట్‌తో తెరకెక్కించామని అన్నారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైందని, సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
కథానాయకుడు యశ్వంత్ మాట్లాడుతూ... రాజ్‌కిరణ్ ఇచ్చిన బాణీలు బాగున్నాయని, రైటర్ మోహన్ సంభాషణలు పొందిగ్గా ఉన్నాయని, నా కెరీర్‌కు ఈ చిత్రం తోడ్పడగలదని ఆశిస్తున్నానన్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా... ఎస్.వి. శివరామ్, ఆర్ట్... ఎస్.వి. మౌళి. ఎడిటర్.. వి. నాగిరెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... శివాజీ ప్రసాద్.
