రీ-రికార్డింగ్‌లో "గుండె ఝల్లుమంది"
|
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... తన మనసుకి నచ్చే మనసు తారసపడ్డప్పుడే స్పందన మొదలవుతుందని, అప్పుడు కురిసే ప్రేమ జల్లులో తడిసి ముద్దవ్వాల్సిందేనని అంటున్నారు. ఈ విషయాన్నే వినోదాత్మకంగా తెరకెక్కించామని వెల్లడించారు. నిర్మాత మాట్లాడుతూ... యువతీ, యువకుల హృదయ స్పందనలకీ, సవ్వళ్లకు దర్పణం ఈ చిత్రమన్నారు.
ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...ఇందులో కాలేజీ స్టూడెంట్‌గా నటిస్తున్నానని, కథతో పాటు, తన పాత్ర ప్రేక్షకుల మెప్పును పొందుతోందన్నారు. ఇంకా ఈ చిత్రంలో అజయ్, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్, ధర్మవరపు, సురేఖావాణి, మధుమణి తదితరులు నటిస్తున్నారు. కెమెరా... ప్రభాకర్ రెడ్డి, పాటలు.. శివశక్తి దత్తా, చైతన్య ప్రసాద్, సమర్పణ.. పరుచూరి కిరీటి.
