1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

25న ప్రేక్షకుల ముందుకు "ఆర్య ఎం.బి.బి.ఎస్"

25న ప్రేక్షకుల ముందుకు
WD PhotoWD
మాధవన్, భావన, ప్రకాష్ రాజ్ ప్రధాన తారాగణంగా రూపొందించిన "ఆర్య ఎం.బి.బి.ఎస్" అనే తమిళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. తేజ సినిమా పతాకంపై సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి బాలశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాటల ప్రదర్శన బుధవారం నాడు ఫిలింఛాంబర్‌లో జరిగింది.

ఈ సందర్భంగా చిత్రం గురించి సి. కళ్యాణ్ మాట్లాడుతూ... తమిళంలో ఈ చిత్రం సూపర్‌హిట్ అయిందని, అందుకే తెలుగులో రీమేక్ చేయాలనుకున్నామని, కానీ భారీ వ్యయంతో తీయాల్సి రావడంతో డబ్బింగ్ చేస్తున్నామని అన్నారు. ఢీ, రెడీ తరహాలో మైండ్‌గేమ్‌తో ఈ చిత్రం రూపొందుతోందని, "ఒక్కడు"కు మించిన పాత్రను ప్రకాష్ రాజ్ ఇందులో పోషించాడని తెలిపారు.

కాలేజీలో హీరోకు, విలన్‌కూ మధ్యసాగే గేమే ఈ చిత్రమని, అది ఏమిటనేది చిత్రంలో చూడాల్సిందేనని అన్నారు మణిశర్మ బాణీలు, మోహన చంద్ర సాహిత్యం ఆకట్టుకుందని, తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రాన్ని ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా... భూపతి, ఎడిటింగ్... త్రినాథ్, సహనిర్మాతలు...పత్సానాగరాజు, సి.వి.రావ్.
About Writer
Selvi