యశోసాగర్, స్నేహా ఉల్లాల్ జంటగా అమృత్ అమరనాథ్ పతాకంపై "తొలిప్రేమ" చిత్ర దర్శకుడు కరుణాకర్ దర్శకత్వంలో బి.పి. సోము, జి.ఎస్. రంగనాథ్ నిర్మిస్తున్న ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం విడుదల వాయిదా పడింది.
ఈ చిత్రాన్ని ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సినీ యూనిట్ వర్గం వెల్లడించింది.
ఎ.ఆర్.రహమాన్ మేనల్లుడు జి.వి ప్రకాష్ సమకూర్చిన సంగీతానికి ఇప్పటికే శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. "దిల్ రాజ్" నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, వేణుమాధవ్, రఘుబాబు, సుధ, సత్యకృష్ణన్, సురేఖా వాణి, శోభారాణి, అపూర్వ తదితరులు నటిస్తున్నారు.