19న వస్తున్న "వీధి రౌడీ"
|
గతంలో "ఎ", "ఉపేంద్ర" వంటి చిత్రాలు ఎంత ఆదరణను చూరగొన్నాయో.. అంతకంటే ఎక్కువగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని సాగర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని పాటలను మంగళవారం నాడు ప్రదర్శించారు. ఐదు పాటలకు రాజేష్ రామ్‌నాథ్ స్వరాలు కూర్చారు.
"వీధి రౌడీ" లాండ్ మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కనుందని, తాను ఉపేంద్ర నటించిన ఎనిమిది చిత్రాలకు సంభాషణలు రాశానని, ఈ చిత్రం తొలికాపీ చూశాక డిస్టిబ్యూటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని భారతీబాబు వ్యాఖ్యానించారు.
