1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఆగస్టులో వస్తున్న "నా అనేవాడు"

ఆగస్టులో వస్తున్న
WD
సద్గురుసాయి క్రియేషన్స్ పతాకంపై రాజీవ్ కనకాల, హరీశ్, తనూజ ప్రధాన తారాగణంగా టి. ప్రశాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం "నా అనేవాడు". ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ నెలాఖరున తొలికాపీ సిద్ధమవుతుందని, ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత ప్రశాంత్ అన్నారు.

అలల ప్రయాణం తీరం వరకే... ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే.. కానీ అసలైన స్నేహ ప్రయాణం కడవరకూ ఉంటుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. "నా అనేవాడు" ఒక్కడుంటే చాలు అనే టైటిల్‌ను కథకు సరిపడా పెట్టామని వెల్లడించారు. సాకేత్‌సాయిరామ్ సమకూర్చిన బాణీలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ప్రశాంత్ తెలిపారు.
About Writer
Selvi