1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

జూలై 31న "కథానాయకుడు" విడుదల

జూలై 31న
WD
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన "కథానాయకుడు" చిత్రం ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 1200 ప్రింట్లతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగులో "కథానాయకుడు", తమిళంలో "కుచేలన్"గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఒకవైపు ప్రేక్షకులు, మరోవైపు రజనీ అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

వచ్చే రెండు రోజుల్లో "కథానాయకుడు" ట్రెయిలర్స్ థియేటర్లకు చేరనున్నాయి. తెలుగులో అశ్వినీ దత్ నిర్మాణ సారథ్యం, పి.వాసు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో జగపతి పాటు తొలిసారిగా రజనీకాంత్‌తో కలిసి నటించడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి. ప్రకాష్ సమకూర్చిన సంగీతానికి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది.
About Writer
Selvi